Andhra Pradesh
హైదరాబాద్‌లో బక్రీద్ సందడి: పొట్టేళ్లకు గిరాకీ జోరు
హైదరాబాద్ నగరంలో బక్రీద్ పండగ సందడి ఊపందుకుంది. ఖుర్బానీ కోసం ముస్లిం సోదరులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని మలక్‌పేట్, సైదాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే పొట్టేళ్ల స్టాళ్లు విరివిగా ఏర్పాటయ్యాయి. రేపు బక్రీద్ పండగ కావడంతో ఈ స్టాళ్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసేందుకు ముస్లిం సోదరులు బారులు తీరుతున్నారు.
మార్కెట్లో ఒక్కో గొర్రె ప్రారంభ ధర రూ.10,000 నుంచి మొదలవుతోంది. భారీ ఆకారంలో ఉన్న పొట్టేళ్లు రూ.20,000కి పైగానే అమ్మకానికి ఉంటున్నాయి. ఈ ఏడాది పొట్టేళ్లకు గిరాకీ గత సంవత్సరాలతో పోలిస్తే బాగానే ఉందని వ్యాపారులు తెలిపారు. పండగ సీజన్‌తో నగరంలో సందడి నెలకొనడంతో పాటు, వ్యాపారం కూడా జోరందుకుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మార్కెట్లో జనసంద్రత పెరిగింది, అయితే అధిక ధరలు కొంతమంది కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ కోసం గొర్రెల కొనుగోలు జోరుగా సాగుతోంది.