Latest Updates
హైదరాబాద్: ‘బడికి బాట’ కలను నెరవేర్చిన అధికారుల జోష్ – థ్యాంక్యూ సర్
హైదరాబాద్ చిలకలగూడలోని దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ మే 26న “మా బడికి బాట వేయించండి” అంటూ ప్లకార్డు చేతబట్టి వినూత్నంగా ధర్నా చేశారు. విద్యార్థుల రాకపోకలకు బాట లేకపోవడంతో ఆయన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించి, తక్షణమే చర్యలు చేపట్టారు.
GHMC సహకారంతో పాఠశాల వద్ద ఉన్న ప్రహరీని తొలగించి, రోడ్డు వేయించారు. అలాగే, పాఠశాలకు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధితో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారిని కలిసి “థ్యాంక్యూ సర్!” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామం సామాజిక మాధ్యమాల్లో ప్రజల ప్రశంసలు అందుకుంటోంది