Latest Updates
హుస్సేన్‌సాగర్‌లో మాన్సూన్ రెగట్టా ఛాంపియన్షిప్ ఉత్సాహం
హుస్సేన్‌సాగర్ ఒడ్డు మరోసారి జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల వేడితో ఉర్రూతలూగుతోంది. యాఊఖీఖిఖిా ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సైనస్గ్ అసోసియేషన్, ఖగీ కఖం ఖం ఆఫ్ హాదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మాన్సూన్ రేగట్టా ఛాంపియన్షిప్ రెండో రోజూ హోరాహోరీగా కొనసాగింది.
ఈ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ పోటీలను ఉత్కంఠభరితంగా మలిచారు. పలు విభాగాల్లో తెలంగాణ, తమిళనాడు క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రెండో రోజు పోటీల్లోనూ వీరు అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో గాలుల వేగం, నీటి ప్రవాహాలను అదుపు చేస్తూ క్రీడాకారులు సెయిలింగ్‌లో తమ నైపుణ్యాన్ని చూపించారు. ఈ పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను వెలికితీసే అవకాశంగా నిలిచాయి. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో సెయిలింగ్ క్రీడను మరింత ప్రోత్సహించే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.
పోటీలు మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో, హుస్సేన్‌సాగర్‌లో ఈ ఉత్సాహభరిత వాతావరణం మరింత రంగులీననుంది.