Uncategorized
సెప్టెంబర్ నుంచి మారబోయే ముఖ్యమైన విషయాలు

సెప్టెంబర్ నెలలో పలు ఆర్థిక, బ్యాంకింగ్, పన్ను సంబంధిత మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణ ప్రజలకు ప్రభావం చూపే ఈ మార్పులను ఒకసారి చూద్దాం.
-
GST కొత్త శ్లాబులు
సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న 56వ GST కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న 4 శ్లాబుల బదులు కేవలం 5% మరియు 18% మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. -
వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి
రేపటి నుంచి వెండి ఆభరణాలపై కూడా హాల్‌మార్క్ విధానం అమల్లోకి రావచ్చు. దీంతో కస్టమర్లు నాణ్యత గల ఆభరణాలు పొందే అవకాశం ఉంటుంది. -
SBI క్రెడిట్ కార్డులపై మార్పులు
కొందరు SBI క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ పోర్టల్స్‌లో చేసే చెల్లింపులకు ఇకపై రివార్డు పాయింట్లు లభించవు. -
జన్‌ధన్ ఖాతాల KYC
జన్‌ధన్ ఖాతాదారులు తమ KYC వివరాలను సెప్టెంబర్ 30లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి. -
ITR ఫైలింగ్ చివరి తేదీ
2025-26 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించబడింది.
![]()
