Entertainment
సినీ ఇండస్ట్రీలో విషాదం: ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలో శోక సంద్రాన్ని నింపింది.
ముకుల్ దేవ్ తెలుగు చిత్రాలైన కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్ వంటి పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ ఆయన సోదరుడు. తల్లిదండ్రుల మరణం తర్వాత ముకుల్ దేవ్ కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
ముకుల్ దేవ్ మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన నటన, సినీ రంగానికి చేసిన కృషిని కొనియాడుతూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ముకుల్ దేవ్ మరణంతో సినీ ఇండస్ట్రీ ఓ ప్రతిభాశాలిని కోల్పోయిందని పలువురు పేర్కొన్నారు.