Entertainment
సరికొత్త రికార్డు.. రూ.404 కోట్ల వసూళ్లు
మోహిత్ సూరి దర్శకత్వంలో, అహాన్ పాండే మరియు అనీత్ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ సినిమా ఘనవిజయం సాధించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించిన ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.404 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది ఓ ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన చిత్రంగా భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని తెలిపారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా దేశంలో రూ.318 కోట్ల గ్రాస్, విదేశాల్లో రూ.86 కోట్లు వసూలు చేసినట్లు సంస్థ తెలిపింది.