Latest Updates
వైరల్ వీడియో: పార్లమెంటు లైవ్‌లో కనిపించేందుకు ఎంపీల ఫీట్లు!
పార్లమెంటు సమావేశాల్లో సంయమనం చూపించాల్సిన ఎంపీలు, ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించేందుకు పోటీ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న రాత్రి పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సభలో ప్రసంగిస్తున్న సమయంలో, వెనుక కూర్చునేందుకు ఎంపీలు పడిన కసరత్తు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తేజస్వీ సూర్య ప్రసంగం మొదలైన క్షణాల్లోనే ఓ ఎంపీ కెమెరా ఫ్రేమ్‌లో కనపడేందుకు వెనుక ఉన్న సీటుపై కూర్చోవడానికి అక్కడికి వచ్చారు. అయితే, అప్పటికే మరో ఇద్దరు ఎంపీలు ఆ సీటును ఆక్రమించడంతో, ఆయన వెనక్కి వెళ్లి మరో సీటులో కూర్చోవాల్సి వచ్చింది. ఈ మొత్తం దృశ్యం పార్లమెంటు లైవ్ ఫీడ్‌లో రికార్డయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. “పహల్గామ్ అమరుల గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఎంపీలు కెమెరా కదలికలపై దృష్టిపెట్టి ఇలా ప్రవర్తించడం తగదా?” అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎంపీల ఈ ప్రవర్తనను అసభ్యంగా అభివర్ణిస్తూ ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్‌కు అతీతంగా, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.