Health
వీకెండ్ నిద్రతో గుండె జబ్బులను తగ్గించుకోండి.
వారమంతా పని ఒత్తిడిలో గడిపి, వీకెండ్లలో విశ్రాంతి తీసుకునే వారికి శుభవార్త! యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, వీకెండ్లలో ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 20 శాతం వరకు తగ్గుతుందని తేలింది. నేటి యువతలో నిద్రలేమి సమస్య పెరుగుతున్న నేపథ్యంలో, వారంలో బిజీ షెడ్యూల్ల్ల కోల్పోయిన నిద్రను వీకెండ్లలో పూర్తిచేసుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్ర మన శరీరాన్ని రీఛార్జ్ చేయడమే కాక, ఒత్తిడి మరియు అలసటను తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది. అయితే, రాత్రిపూట స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పని ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది తగినంత నిద్ర పొందడం లేదు. వీకెండ్లలో నిర్ణీత షెడ్యూల్తో, స్క్రీన్ టైమ్ తగ్గించి, హాయిగా నిద్రపోయే వాతావరణాన్ని సృష్టించుకోవడం ద్వారా గుండె జబ్బుల నుండి రక్షణ పొందవచ్చు.