Latest Updates
విశాఖ కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం: ఉగాదికి ప్రారంభోత్సవం!
విశాఖపట్నం పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కైలాసగిరిపై వీఎంఆర్డీఏ (VMRDA) ప్రతిష్టాత్మకంగా ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను చేపట్టింది. సుమారు రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ త్రిశూలం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.భారీ ఈ త్రిశూలం ఎత్తు 65 అడుగులు, వెడల్పు 30 అడుగులు. దీని చుట్టుకొలత 3 అడుగులుగా ఉంది,త్రిశూలానికి అమర్చిన ఢమరుకం ఒక్కటే 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో గంభీరంగా ఉండబోతోంది.
ఆధునిక సాంకేతికతను సానుకులంగా ఫైబర్ రీఇన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో దీనిని తయారు చేశారు. తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా అత్యంత దృఢంగా దీనిని డిజైన్ చేశారు,రాత్రి వేళల్లో నగరం వెలుగులు నలుమూలల నుండి కనిపించేలా దీనికి 100 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.పర్యాటకులు త్రిశూలం వద్ద నిలబడి ఫొటోలు తీసుకునేలా 30 అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక వేదికగా సెల్ఫీ పాయింట్ నిర్మిస్తున్నారు.
మొదట శివరాత్రి నాటికే పూర్తి చేయాలని భావించినప్పటికీ, పనుల నాణ్యత దృష్ట్యా ఈ ఉగాది నాటికి దీనిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పుణెలో తయారైన ఆకృతులు విశాఖకు చేరుకున్నాయి.రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జి, స్కై సైక్లింగ్‌లతో అలరిస్తున్న కైలాసగిరిపై, ఈ త్రిశూలం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
![]()
