Entertainment
విజయ్-త్రిష మధ్య రిలేషన్షిప్ ఉందా? వైరల్ అవుతోన్న ఫొటోపై చర్చలు
స్టార్ హీరోయిన్ త్రిష మరియు కోలీవుడ్ టాప్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ మధ్య రిలేషన్షిప్ ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇందులో త్రిష పెట్ డాగ్ ‘ఇజ్జీ’ని విజయ్ ఆడిస్తున్నట్టు కనిపించగా, పక్కనే త్రిష కూర్చొని ఆనందంగా చూస్తున్న దృశ్యం నెటిజన్లను ఆసక్తికర చర్చలో ముంచేసింది.
ఈ ఫొటో వెలుగులోకి రావడంతో వారిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి పనిచేసిన నేపథ్యంలో వారి మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫొటోతో ఆ స్నేహం మరింత ముదిరిందా? లేక నిజంగానే ఇది రిలేషన్‌షిప్‌కు సంకేతమా? అన్నది ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.