కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు.
క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు.