Andhra Pradesh
రేషన్ లబ్ధిదారులకు నిరాశ – కందిపప్పు పంపిణీ మళ్లీ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులు ఈ నెల కూడా నిరాశకు గురయ్యారు. రేషన్ షాపుల్లో కందిపప్పు పంపిణీ జరగకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గత కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయిన కందిపప్పు, పండుగల సీజన్ కావడంతో ఈసారి అయినా అందుతుందని చాలామంది ఆశించారు. అయితే షాపులకు వెళ్లాక కందిపప్పు లేదన్న వార్త విన్న వారు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమిత పరిమాణంలో పంపిణీ జరగుతోందన్న వార్తలు వస్తున్నా, మెజారిటీ షాపుల్లో అందుబాటులో లేదని తెలుస్తోంది. మార్కెట్లో కందిపప్పు ధర కేజీకి ₹120 దాటి పోవడంతో, ఇది సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మీకు ఈ నెల రేషన్‌లో కందిపప్పు వచ్చిందా?
మీ అనుభవాన్ని కామెంట్లలో షేర్ చేయండి.