Andhra Pradesh
‘యోగాంధ్ర’ ఘనవిజయం పై ప్రధాని ప్రశంసలు – లోకేశ్‌ను అభినందించిన మోదీ
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హర్షంగా అభినందించారు. ఈ కార్యక్రమం విజయానికి కారణమైన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నెల రోజులుగా అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తూ, తానే స్వయంగా పర్యవేక్షించడాన్ని ప్రధాని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “యోగాంధ్ర” ద్వారా యోగాను ఒక సామాజిక ఉత్సవంగా ఎలా మలచాలో ప్రదర్శించారని, అన్ని వర్గాల ప్రజలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో లోకేశ్ చూపిన నాయకత్వం అభినందనీయమని అన్నారు. ఇది సామాజిక స్పృహకు నిదర్శనమని కొనియాడారు.