International
మిస్ వరల్డ్ వివాదంపై స్పందించిన CEO
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ స్పందించారు. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆమె కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా యూకేకి వెళ్లిపోయారని జూలియా మోర్లీ తెలిపారు. యూకేకి చేరుకున్న తర్వాత మిల్లా, బ్రిటన్ మీడియాతో మాట్లాడుతూ పోటీల్లో వేధింపులు జరిగాయని ఆరోపించారని, అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని ఆమె స్పష్టం చేశారు.
మిల్లా మ్యాగీ స్థానంలో కొత్తగా చార్లెట్ గ్రాంట్‌ను మిస్ ఇంగ్లండ్‌గా ఎంపిక చేసినట్లు మిస్ వరల్డ్ సంస్థ ప్రకటించింది. ఈ పోటీల్లో చార్లెట్ గ్రాంట్ యూకే తరఫున పాల్గొననున్నారని జూలియా మోర్లీ వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపదని, పోటీలు పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరుగుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.