Connect with us

Entertainment

భారత జట్టులో తన భవిష్యత్తుపై స్పందించిన మహ్మద్ షమీ

మొహమ్మద్‌ షమీ రిటైర్మెంట్‌..? రైట్‌ టైమ్‌ అంటూ బిగ్‌ షాక్‌ ఇచ్చిన స్టార్‌  బౌలర్‌.. - Telugu News | Shami Denies Retirement Rumors: Future with Team  India Uncertain? | TV9 Telugu

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఘాటుగా స్పందించారు. తన ఆటపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, “నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? నా రిటైర్మెంట్‌తో ఎవరికైనా మేలు కలుగుతుందా? నేను ఇంకా ఆడగల శక్తి, ఉత్సాహం ఉంది. బోర్ కొట్టిన రోజే నేను స్వచ్ఛందంగా వెళ్ళిపోతాను కానీ ఎవరి ఒత్తిడికైనా కాదు” అని స్పష్టం చేశారు.

తన ఎంపికపై ఏవైనా వివాదాలు ఉన్నా వాటిని పట్టించుకోనని షమీ తెలిపారు. “జాతీయ జట్టుకు తీసుకోకపోతే కూడా నాకు డొమెస్టిక్ క్రికెట్ ఉంది. ఎక్కడో ఒకచోట నేను ఆడుతూనే ఉంటా. నన్ను సెలక్ట్ చేయలేదు కాబట్టి ఎవర్నీ నేను నిందించను. ఆట అంటే నాకు ప్యాషన్. దానికి తగ్గట్టుగానే నేను కష్టపడుతూనే ఉంటా” అని ఆయన పేర్కొన్నారు.

అవకాశం వచ్చిన ప్రతిసారి తన సత్తా చాటుతానని షమీ ధైర్యంగా చెప్పారు. “ఆటలో నిరూపించుకోవడమే నా లక్ష్యం. దాని కోసమే నేను నిరంతరం కష్టపడి శ్రమిస్తున్నా. రిటైర్మెంట్ గురించి మాట్లాడేవాళ్లు తమ పని చేసుకోవాలి. నేను ఆట ఆడేంతవరకు నా శ్రద్ధ, శ్రమ అంతా క్రికెట్‌ పైనే ఉంటుంది” అంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *