News
పహల్గామ్ ఘటన తర్వాత ఇందిర గురించి చర్చ: రేవంత్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో ప్రధానమంత్రి అంటే ఇందిరా గాంధీలాంటి నాయకత్వం కావాలనే చర్చ జోరందుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ పాలనలో పాకిస్థాన్‌ను రెండు ముక్కలుగా చేసిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రత, నాయకత్వం గురించి తీవ్ర చర్చకు దారితీసిందని, ఇందిరమ్మ నిర్ణయాలు దేశానికి ఎంతటి బలాన్నిచ్చాయో ప్రజలు గుర్తిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
మరోవైపు, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నామని, అలాగే 60 వేల ఉద్యోగాలను కల్పించినట్లు ఆయన తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని సీఎం హామీ ఇచ్చారు.