Health
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుదల: 24 గంటల్లో 324 కొత్త కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 136, గుజరాత్‌లో 129, కేరళలో 96 కేసులు పాజిటివ్‌గా తేలాయి.
ప్రస్తుతం దేశంలో మొత్తం 6,815 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో కేరళలో అత్యధికంగా 2,053 కేసులు, గుజరాత్‌లో 1,109, ఢిల్లీలో 691, మహారాష్ట్రలో 613 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అదే సమయంలో, గత 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలను ముమ్మరం చేయడంతో పాటు, ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.