International
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపై కెప్టెన్ సూర్య విశ్లేషణ..పవర్‌ప్లేలోనే మ్యాచ్ చేజారిందా?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రోటీస్ బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల తేడాతో ఎదురైన ఈ పరాజయం, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌కు అతిపెద్ద ఓటమిగా నమోదైంది.
పవర్‌ప్లే ముగియకముందే 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోవడం భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ త్వరగానే పెవిలియన్ చేరారు,లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ భారత బ్యాటర్లు కనీస భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు,మధ్య ఓవర్లలో పరుగుల ప్రవాహం,బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ.. మధ్య ఓవర్లలో డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ జోడీని అడ్డుకోవడంలో భారత్ విఫలమైంది.
కెప్టెన్ సూర్య ఏమన్నారంటే,”180కి పైగా పరుగులు ఛేజ్ చేసేటప్పుడు పవర్‌ప్లేలోనే మ్యాచ్ గెలవలేకపోవచ్చు కానీ, అక్కడే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. మేము సరిగ్గా అదే తప్పు చేశాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది. బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, బ్యాటింగ్‌లో మేము ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాము” అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ బెర్తు ప్రమాదంలో పడింది. ఇకపై జరగబోయే జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్‌లు టీమ్ ఇండియాకు జీవన్మరణ సమస్యగా మారాయి. సెమీస్ చేరాలంటే భారత్ ఈ రెండింటిలోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
![]()
