Entertainment
‘థగ్ లైఫ్’ యూనిట్‌కి భద్రత కల్పిస్తాం: కర్ణాటక ప్రభుత్వ హామీ
చిత్రరంగంలో తీవ్ర చర్చకు దారి తీసిన ‘థగ్ లైఫ్’ విడుదల నేపథ్యంలో, చిత్ర యూనిట్‌కు తగిన భద్రత కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. సినిమా విడుదల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం తమ బాధ్యత అని, దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
కన్నడ భాషపై నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర ప్రతిఘటనలు వెలువడ్డాయి. ఈ వివాదం కారణంగా ‘థగ్ లైఫ్’ విడుదల ఆపాలన్న డిమాండ్లు వచ్చాయి. అయితే, సినిమా విడుదలను నిలిపివేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వం ఇప్పుడిది ఒక చట్టబద్ధమైన ప్రక్రియగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది.