Andhra Pradesh
తోతాపురి రైతులకు మద్దతు ధరపై శుభవార్త
తోతాపురి మామిడికి మద్దతు ధర ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.1,490 మద్దతు ధరగా నిర్ణయించింది. ఈ మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరించనున్నాయి. మద్దతు ధర మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ కార్యక్రమం కింద 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తోతాపురి రైతులకు ఇది ఎంతో ఉపశమనంగా మారుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.