Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో రేపు కూడా వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రేపు కూడా వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు తీవ్రతరం కానున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పేర్కొంది. తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే సూచనలు ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.