Connect with us

Latest Updates

తెలంగాణకు వాతావరణ హెచ్చరిక: రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగళ్ల వాన!

#తెలంగాణవర్షాలు #వాతావరణహెచ్చరిక #హైదరాబాద్వర్షం #వడగళ్లవాన #రైతుఅలర్ట్ #తెలంగాణన్యూస్ #హైదరాబాద్అప్‌డేట్స్ #పిడుగులు #సంగారెడ్డి #ఉపరితలఆవర్తనం #రెయిన్అలర్ట్ #వాతావరణం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ జిల్లాలో రాబోయే రెండు గంటల్లో వడగళ్ల వాన కురిసే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు,ముఖ్య ప్రభావిత జిల్లాలు,కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది.

ప్రాంతాల వారీగా యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది,మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది,హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి లోపు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. నగరవాసులు తమ ప్రయాణాలను దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండల తీవ్రత పెరిగినప్పటికీ, ప్రస్తుత వర్షాలతో వాతావరణం కొంత చల్లబడింది. అయితే, ఈ వర్షాల తర్వాత ఎండలు మరింత తీవ్రంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *