International
ట్రంప్‌కు మరోసారి పరోక్షంగా కౌంటరిచ్చిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఆర్థికవ్యవస్థను విమర్శిస్తూ “ఇండియా డెడ్ ఎకానమీ” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నేరుగా స్పందించకపోయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆయన భారత్ వేగంగా ఎదుగుతోందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు. “రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్సఫార్మ్” స్ఫూర్తితోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని మోదీ అన్నారు.
బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, దేశంలో మౌలిక వసతుల విస్తరణను ప్రస్తావించారు. 2014లో కేవలం ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో రైలు నెట్వర్క్ ఇప్పుడు 24 నగరాలకు విస్తరించిందని, మొత్తం 1,000 కిలోమీటర్లకు పైగా నడుస్తోందని తెలిపారు. ఈ వేగం భారత మౌలిక వసతుల అభివృద్ధిని ప్రతిబింబిస్తోందని అన్నారు.
విమానాశ్రయాల అభివృద్ధిని కూడా మోదీ వివరించారు. 11 ఏళ్లలో దేశంలో ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 74 నుంచి 160కి పెరిగిందని చెప్పారు. ఈ మార్పులు ప్రజలకు సౌకర్యాన్ని మాత్రమే కాదు, ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు. భారత్‌లో జరుగుతున్న ఈ పురోగతి, విమర్శలకు సమాధానం చెబుతున్నదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.