Entertainment
జూనియర్ ఎన్టీఆర్ ‘కాంతార-3’లో నటించబోతున్నారా..?
కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్ర సిరీస్ మూడవ భాగానికి రంగం సిద్ధమవుతోంది. ‘కాంతార చాప్టర్-1’ షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా, దాని తర్వాతి భాగాలపై సినిమాటిక్ యూనిట్ దృష్టి పెట్టింది. దర్శకుడు రిషబ్ శెట్టి, ఈ ప్రాజెక్ట్‌ను మరింత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ‘కాంతార-3’లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని సినీ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపధ్యంలో, ఆయన ఈ చిత్రంలో భాగమవుతారని సమాచారం ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక ఈ వార్తల నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. “ఎన్టీఆర్ ‘కాంతార’లో ఉంటే బాక్సాఫీస్ హిట్ ఖాయం” అంటూ పోస్టులు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే విభిన్న కాన్సెప్ట్‌తో గుర్తింపు పొందిన ‘కాంతార’కి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో కలిస్తే, దానికి మరో లెవెల్ హైప్ వచ్చి, దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.