Latest Updates
గిగ్ వర్కర్లకు ప్రత్యేక పాలసీ.. సంక్షేమ బోర్డు, బీమా సదుపాయాలు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వర్క్‌ఫోర్స్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ ఉద్యోగులు వంటి గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కొత్త పాలసీ ద్వారా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం వివరించారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వారి భద్రత, ఆరోగ్య పరిరక్షణ, ఆదాయ స్థిరత్వం వంటి అంశాల్లో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇది దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా రూపొందించనున్న విధానం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.