Entertainment
గద్దర్-2024 అవార్డులు ప్రకటించిన TG ప్రభుత్వం – అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గద్దర్-2024 సినిమా అవార్డులను ఈరోజు అధికారికంగా ప్రకటించింది. సినిమాటిక్ అద్భుతాలను గుర్తించి, కళాకారులను గౌరవించే ఈ కార్యక్రమానికి గద్దర్ పేరును ధరించడం గర్వకారణంగా ఉంది. ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ అవార్డును ప్రముఖ నటుడు అల్లు అర్జున్ గెలుచుకున్నారు. ఆయన “పుష్ప-2” చిత్రంలో చేసిన పాత్రకు ఈ అవార్డు లభించింది.
అవార్డు ప్రకటన సందర్భంగా జ్యూరీ చైర్మన్ జయసుధ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తమ చిత్రంగా “కల్కి” ఎంపికైందని తెలిపారు. విజువల్స్, కథ, దర్శకత్వం అన్నింటిలోనూ కల్కి చిత్రాన్ని జ్యూరీ సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇతర ప్రధాన విభాగాల్లో గెలుపొందిన వారు ఇలా ఉన్నారు:
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటి: నివేదా థామస్ – “35: చిన్న కథ కాదు”
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్ (బీమ్స్ సిసిరోలియో)
ఉత్తమ ద్వితీయ చిత్రం: పొట్టేల్
ఉత్తమ తృతీయ చిత్రం: లక్కీ భాస్కర్