Latest Updates
క్లాసెన్ రూ.23 కోట్ల విలువను సార్థకం చేసుకున్నాడు! సెంచరీతో మెరిసిన సన్‌రైజర్స్ బ్యాటర్
హైదరాబాద్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హైన్రిచ్ క్లాసెన్, తన ప్రదర్శనతో ఆ పెట్టుబడికి న్యాయం చేశాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రూ.23 కోట్లకు టీమ్ కొనుగోలు చేసిన ఈ శాటర్, తన శైలిలో ఆడుతూ మరోసారి తన విలువను నిరూపించుకున్నాడు.
గత మూడు ఐపీఎల్ సీజన్లలో క్లాసెన్ బ్యాటింగ్ పరంగా అసాధారణ స్థాయిలో నిలిచాడు. 2023 సీజన్లో 448 పరుగులు, 2024లో 479 పరుగులు, తాజాగా 2025 సీజన్లో 487 పరుగులు సాధించి, అన్ని సీజన్లలో 400 పైగా పరుగులతో చక్కటి స్థిరత కనబరిచాడు.
ఇటీవలి మ్యాచ్‌లో ఆయన సెంచరీ బాదుతూ ప్రత్యర్థులపై చెమటలు పట్టించాడు. ఈ మ్యాచుతో పాటు మొత్తంగా 2025 సీజన్‌ను అత్యుత్తమ ప్రదర్శనతో ముగించాడు. భారీ ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పటికీ ఒత్తిడిని పట్టించుకోకుండా తన ఆటతీరుతో అభిమానులను మురిపించాడు.
ఈ సీజన్లో SRH జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, క్లాసెన్ మాత్రం ఒంటరిగా పోరాడుతూ జట్టు గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ (SRH అభిమానులు) “23 కోట్ల క్లాసెన్ నిజంగా ‘వర్త్’!” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే విధంగా కొనసాగే ప్రదర్శనలతో క్లాసెన్ నేడు SRH మాత్రమే కాకుండా ఐపీఎల్లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.