Latest Updates
కేటీఆర్ భాష మార్చుకోవాలి: కాంగ్రెస్ MLC అద్దంకి దయాకర్ విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆవేదన వ్యక్తం చేశారు. “కేటీఆర్ వాడుతున్న భాష తెలంగాణ రాజకీయాలకు చెడ్డపేరు తీసుకువస్తోంది,” అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని, కానీ కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు తిరస్కరించడమే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన అసలు కారణమని గుర్తు చేస్తూ, ఇకనైనా కేటీఆర్ తన భాషా శైలిని మార్చుకోవాలని హితవు పలికారు