Latest Updates
కాళేశ్వరం పనికిరాదన్నవాడు అజ్ఞాని” – కమిషన్ నివేదికపై కేసీఆర్ స్పందన
తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన కమిషన్ నివేదికపై తీవ్రంగా స్పందించిన ఆయన, “ఇది కాళేశ్వరం కమిషన్ కాదు… కాంగ్రెస్ కమిషన్” అంటూ మండిపడ్డారు.
ఆ నివేదిక ముందే ఊహించదగినదేనని, ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. “కాళేశ్వరం పనికిరాదని చెప్పడం అసంబద్ధం… అటువంటివారు ప్రాజెక్టుల పరంగా ఎలాంటి అవగాహన లేని అజ్ఞానులు” అని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిందిగా, ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరించాలంటూ తన పార్టీ నాయకులకు కేసీఆర్ సూచనలు ఇచ్చారు.
అంతేకాక, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి జీవనాధారంగా నిలిచిందని, సాగునీటి సరఫరా, తాగునీటి పథకాల పరంగా ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.