International
కశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగమే: ఫరూక్ అబ్దుల్లా
కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. శనివారం పహల్గామ్లో టూరిస్టులతో సమావేశమైన ఆయన, వారితో సంభాషించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రదాడులకు భయపడని ప్రజలు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని కోరుకుంటున్నారని అన్నారు.
“కశ్మీర్లో గత 35 ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగుతోంది. అయినప్పటికీ, ఒక రోజు ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తామనే నమ్మకం మాకుంది,” అని ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ప్రజలు కోరుకుంటున్నారని, దీనికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.