National
ఆర్సీబీని కలవరపెడుతున్న ఆ తేదీ!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల గుండెల్లో మే 18 తేదీ మళ్లీ కలవరం రేపుతోంది! గత ఏడాది ఇదే రోజున ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, అభిమానుల్లో ఆనందం నింపింది. విరాట్ కోహ్లీ ఫేవరెట్ నంబర్ 18తో కప్పు గెలుస్తామని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు, కానీ చివరకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది కూడా మే 18నే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ సంతోషకర వార్తతో అభిమానులు ఒకవైపు ఉప్పొంగుతుంటే, మరోవైపు గత ఏడాది ఫలితం రిపీట్ అవుతుందేమోనన్న ఆందోళన కూడా వెంటాడుతోంది.
ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో 17 పాయింట్లతో టాప్-4లో నిలిచింది. కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో జట్టు గట్టి పోటీ ఇస్తోంది. కానీ, అభిమానుల మనసులో ఆ మే 18 గురించిన భయం ఇంకా తొలగలేదు. “ఈసారైనా కప్పు మాదే” అని ఒకవైపు ఆశిస్తూనే, గత ఓటముల జ్ఞాపకాలు వారిని వెన్నాడుతున్నాయి. మరి, ఈసారి ఆర్సీబీ ఆ జిన్క్స్‌ను బద్దలు కొట్టి కప్పు సాధిస్తుందా? ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లపైనే