Connect with us

Latest Updates

ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక చర్చకు కేంద్రం డేట్‌ ఖరారు

పహల్గాం ఉగ్రదాడి, 'ఆపరేషన్ సిందూర్‌'పై ఉభయ సభల్లో రభస – Nijam Today

పార్లమెంట్‌ మాన్సూన్ సమావేశాల్లో కీలక అంశంగా మారిన ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక చర్చకు కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు 16 గంటల సమయాన్ని కేటాయించినట్టు సమాచారం.

విపక్షాల నిరంతర ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంటి కీలక నేతలు ఈ చర్చకు హాజరవుతారని అంచనా.

అంతకుముందు, రేపటినుంచే చర్చ ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేసినా, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా కేంద్రం ఆ ప్రతిపాదనను అంగీకించలేదు. దీంతో నిర్ణీత తేదీల్లోనే చర్చ జరగనుంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *