News
అవినీతిపై గ్రామగ్రామాన ప్రచారం చేయాలి: KTR
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా BRS పార్టీ సమాయత్తమవుతోంది. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాన్ని అనుసరించి, ఈ వారంలోనే నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా పార్టీ వర్కర్లతో సమావేశమైన KTR, ఎన్నికలకు ముందుగా శ్రేణులన్నీ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయని హామీలను, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలను గ్రామాల్లో ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.