Health
అమెరికాలో మళ్లీ కొవిడ్ వేవ్.. 25 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల
అమెరికాలో మళ్లీ కోవిడ్ వేవ్ ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం, దేశంలోని సుమారు 25 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ప్రస్తుతం NB.1.8.1 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండగా, ఇది ప్రజల్లో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.
అక్కడ వేసవి కాలం కావడంతో హాలిడే ట్రిప్స్, పార్టీల్లో పాల్గొనడం, కొంతమందిలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల వైరస్ వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇదే స్థితి కొనసాగితే మరికొన్ని రోజుల్లో అమెరికా అంతటా వైరస్ విస్తరించే అవకాశం ఉంది. ప్రజలు మళ్లీ మాస్కులు, శానిటైజర్లు, దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.