Andhra Pradesh

రైలులో నుంచి దూకిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాక్..!

విజయవాడ సమీపంలో ఓ మహిళ రైలు నుంచి కాలువలోకి దూకేసింది. ఆమె దాదాపు 10 గంటల పాటూ ఆ కాలువలోనే ఉండిపోయింది.. ఆ తర్వాత కొంతమంది స్థానికులు గుర్తించడంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఆమె గురించి ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది. బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన షేక్‌ ఖాదర్‌వలి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అదే జిల్లా నిజాంపట్నంలో కాపురం ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఖాదర్‌వలి భార్య జిన్నతున్నీసా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం ఎప్పటి నుంచో మందులు వాడుతున్నారు.

జిన్నతున్నీసా తాను మందులు వాడలేకపోతున్నానంటూ బాధపడుతూ ఉండేవారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు.. కొన్ని గంటలు బాగానే ఉంటుంది.. మరికొన్ని గంటలు మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. అప్పుడప్పుడు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోతూ ఉండేది. గతంలో ఇంటి నుంచి వెళ్లిపోగా.. మళ్లీ వెతికి తీసుకొచ్చారు. తాజాగా మరోసారి జిన్నతున్నీసా కుటుంబ సభ్యులకు చెప్పకుండా శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపునకు వెళ్లే ఓ రైలెక్కారు.

ఆ రైలు రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ పూల మార్కెట్‌ దగ్గరకు వచ్చింది. జిన్నతున్నీసా రైలు నుంచి కిందనున్న బందరు కాలువలోకి దూకేసింది. ఇక కాలువలో నీటి ప్రవాహానికి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది.. అక్కడ ఒక చెట్టుకొమ్మను పట్టుకుని రాత్రంతా నీటిలోనే ఉండిపోయింది. ఉదయాన్నే ఆమెను గమనించిన స్థానికులు.. వెంటనే సమీపంలోని కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడకి చేరుకుని ఆమెను బయటకు తీసుకొచ్చారు.. స్వల్పంగా గాయపడినట్లు గుర్తించి వెంటనే వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిన్నతున్నీసా గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version