Entertainment
విజయ్ దేవరకొండ నుంచి దీపావళి గిఫ్ట్స్.. ఫ్యామిలీ తరపున కానుకలు

సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్, సెలబ్రెటీలు దీపావళి సందర్భంగా మీడియా వారికి, ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులకు, తమ వద్ద జాబ్ చేసే వారికి కానుకలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. దీపావళి కానుకల సంప్రదాయం మన టాలీవుడ్‌లో ప్రతి ఏడాది కొనసాగుతోంది. ఈసారి విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన స్వీట్స్ తో కూడిన దీపావళి సర్‌ప్రైజ్ ప్యాక్ ను మీడియా వారికి, ఇండస్ట్రీ కి చెందిన కొందరికి ఇంకా తన సన్నిహితులకు పంపించారు. ప్యాక్ లో స్వీట్స్ తో పాటు కొన్ని రకాల పిండి వంటలు ఇంకా దేవరకొండ ఫ్యామిలీ తరపున దీపావళి శుభాకాంక్షలు అంటూ ఒక గ్రీటింగ్ కార్డు ఉంది.
విజయ్ దేవరకొండ నుంచి దీపావళి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ను అందుకున్న మీడియా వర్గాలు, సినీ వర్గాలు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. అలానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి కూడా కొందరికి ఈ దీపావళి గిఫ్ట్ అందించినట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మాత్రమే దీపావళి వేడుకలు జరుపుకోవడం కాకుండా, అందరితోనూ సంతోషం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో స్వీట్స్, కానుకలు అందజేశారు. దీంతో సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండను, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ను అభినందిస్తూ, పెద్ద ఎత్తున దేవరకొండ ఫ్యామిలీ కి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించనున్నాడు. అంతే కాకుండా సినిమాలోని ఆయన పాత్ర గతంలో చేసిన పాత్రలకు చాలా విభిన్నంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇటీవల తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించి, విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
గౌతమ్ తిన్ననూరి సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉండే అవకాశాలు ఉన్నటు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.