Tours / Travels
Vande Bharat Train Ticket ఇలా బుక్ చేస్తే తక్కువ బడ్జెట్లో వందే భారత్ ట్రైన్ జర్నీ

Vande Bharat Train Ticket ఇలా బుక్ చేస్తే తక్కువ బడ్జెట్లో వందే భారత్ ట్రైన్ జర్నీ చేసేయొచ్చు..
Vande Bharat Train Ticket మనలో చాలా మందికి వందే భారత్ ట్రైన్లో ఒక్కసారైనా జర్నీ చేయాలని ఆశగా ఉంటుంది. అయితే ఈ ట్రైన్ టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో అందరూ ఈ జర్నీని చేయలేకపోతున్నారు. అయితే తక్కువ ధరకే వందే భారత్ ట్రైన్ ఎక్కొచ్చు. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి…
భారతీయ రైల్వేల్లో వందే భారత్ ట్రైన్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇవి పాత రైళ్ల కంటే వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. దీంతో ఈ రైలు జర్నీని అందరూ ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు ఈ రైలులో వైఫై, ఆహారం, ఎంటర్ టైన్మెంట్ కోసం 32 అంగుళాల పెద్ద స్క్రీన్, విశాలమైన విండోస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ వందే భారత్ రైలు 2019లో ఢిల్లీ నుంచి వారణాసికి తొలి ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 51 కంటే ఎక్కువ మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-వైజాగ్, కాచిగూడ-బెంగళూరు, విజయవాడ-నెల్లూరు-చెన్నై, విశాఖపట్నం-పలాస-భువనేశ్వర్ వరకు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే త్వరలో ఇదే రూట్లలో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇదిలా ఉండగా.. టికెట్లను ఇలా బుక్ చేస్తే వందే భారత్ ట్రైన్లలో రూ.1000లోపే ఎంచక్కా జర్నీ చేయొచ్చు. కొత్త ట్రైన్లో ట్రా‘వెల్’ను ఎంజాయ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడే చూసెయ్యండి…
హైదరాబాద్- కర్నూలు..
ట్రైన్ నెంబర్ 20703
దూరం : 236 కిలోమీటర్లు
టికెట్ ధర : రూ.795-రూ.1480
హైదరాబాద్-విజయవాడ..
1) ట్రైన్ నెంబర్ : 20707
2) ట్రైన్ నెంబర్ : 20834
దూరం : 348 కిలోమీటర్లు
జర్నీ టైమ్ : నాలుగు గంటలు
టికెట్ ధర : రూ.905 – 960 వరకు
విజయవాడ-రేణిగుంట-చెన్నై..
ట్రైన్ నెంబర్ : 20678
దూరం : 513 కిలోమీటర్లు
జర్నీ టైమ్ : 6:40 గంటలు
టికెట్ ధర : రూ.1420 – 2630 వరకు
సికింద్రాబాద్-తిరుపతి
ట్రైన్ నెంబర్ : 20701
ట్రైన్ నెంబర్ : 20701
దూరం : 662 కిలోమీటర్లు
జర్నీ టైమ్ : 8:19 గంటలు
టికెట్ ధర : రూ.1680 – 3080 వరకు
విశాఖ-పలాస..