Business
బంగారం ధరల ప్రభావం.. వేగంగా పెరుగుతున్న జువెలర్స్ స్టాక్..

దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో, ఒక ప్రముఖ జువెలరీ కంపెనీ స్టాక్ చాలా బాగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే ఏకంగా 400 శాతం పెరిగింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.5 లక్షలు అందించింది. రోజూ పాజిటివ్ ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. మరి ఈ స్టాక్ ప్రస్తుతం ఎంత ధరకు ట్రేడింగ్ అవుతుందో తెలుసుకుందాం.
స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన జువెలరీ కంపెనీ పీసీ జువెలర్స్ (PC Jewelers Ltd) స్టాక్ అద్భుతంగా పెరుగుతోంది.దేశీయంగా బంగారం ధరలు సరికొత్త గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్న క్రమంలో ప్రస్తుతం బంగారం వ్యాపారం నిర్వహించే కంపెనీల స్టాక్స్ రాణిస్తున్నాయి. తమ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇచ్చే మల్టీబ్యాగర్ జువెలర్స్ స్టాక్స్‌లో పీసీ జువెలర్స్ ఒకటి. గత ఏడాదిలో ఈ స్టాక్ 400 శాతం లాభాలు కలిగించింది. అక్టోబర్ 2023లో రూ. 30 ఉన్న ఈ స్టాక్, ఇప్పుడంటే అక్టోబర్ 14, 2024న రూ. 159కి పెరిగింది.ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం.
మరోవైపు, ఈ కంపెనీ కొన్ని రోజుల క్రితం స్టాక్ స్ప్లిట్ చేయనుందని ప్రకటించింది. 1:10 రేషియోలో స్టాక్స్ విభజన చేసేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీని ప్రకారంరూ. 10 ముఖ విలువ ఉన్న ఒక ఈక్విటీ షేరు, రూ. 1 ముఖ విలువ గల 10 షేర్లుగా విభజించనుంది.దీంతో స్టాక్ ధర ఒక్కసారిగా దిగిరానుంది. రూ. 159 వద్ద ఉన్న ఈ స్టాక్ రూ.15 స్థాయికి పడిపోనుంది. అయితే, రిటైల్ ఇన్వెస్టర్లకు తమ స్టాక్ కొనే ధరలో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.అయితే, ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్ సోమవారం అక్టోబర్ 14వ తేదీ ట్రేడింగ్ సెషన్‌లో పీసీ జువెలర్స్ కంపెనీ స్టాక్ దాదాపు 4 శాతం లాభంతో రూ. 159 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ స్టాక్ గత 5 సెషన్లలో 11 శాతం లాభాలు ఇచ్చింది. గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్ల సంపత్తిని మూడింతలు పెంచింది. ఏకంగా 200 శాతం పెరిగింది. ఈ ఏడాది 2024లో ఇప్పటి వరకు 216 శాతం పెరిగింది.గత ఏడాదిలో 400 శాతం రిటర్న్స్ ఇచ్చింది. లక్ష పెట్టుబడిని రూ. 5 లక్షలు చేసింది.