Connect with us

Telangana

మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు

మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు

తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మై హోం అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు రామురావు, ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం (నవంబర్ 7న) ప్రధాని నివాసంలో కలిసిన జూపల్లి రామేశ్వర్ రావు, మోదీకి శాలువా ఆర్పి సత్కరించారు. వేంకటేశ్వరుని విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. స్నేహపూర్వకంగా సమావేశమైన ఈ సందర్భంలో మోదీ, జూపల్లితో ఆత్మీయంగా మాట్లాడారు. ముచ్చటించారు.

చిన్న స్థాయి నుంచి ప్రారంభమై నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు మరియు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు గురువారం (నవంబర్ 7న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్నేహపూర్వకంగా మరియు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఈ సందర్భంలో జూపల్లి రామేశ్వర్ రావు, రామురావుతో ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన లోతైన ఆధ్యాత్మిక విలువలు, దేశానికి సేవ చేయాలనే బలమైన నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వం, ప్రజల పట్ల అంకితభావం అందరికీ తెలుసు. భారతదేశంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు మోదీ చేస్తున్న కృషి ఎనలేనిది. తనలో ఉన్న ఆ భావనకు నిదర్శనంగానే.. 2022లో హైదరాబాద్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ఆయన ప్రారంభించారు. శ్రీ రామానుజాచార్య గౌరవార్థం చిన జీయర్ స్వామి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న సంగతి తెలిసిందే.

మోదీ విలువలు, ఆయన ఆలోచనలు భారతదేశపు భవిష్యత్తు మహత్తరపూర్వకంగా తీర్చిదిద్దుతాయి. ఇది వ్యక్తిగత వినయం, ఇతరులను సహాయపడాలనే కోరిక, కరుణ, సేవా సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ “మానవ కేంద్రీకృత విధానానికి” అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ అన్న విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో.. నిర్మాణ రంగంలో బాహుబలి కంపెనీ‌గా పేరొందిన.. మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్ ప్రాజెక్టును ఆగస్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. “మై హోమ్ అక్రిదా” పేరుతో నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి దగ్గరలో గోపన్ పల్లి నుంచి తెల్లాపూర్‌ రోడ్డు మార్గంలోని ఫ్రైమ్ ఏరియాలో ఈ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తున్నారు. మై హోమ్ అక్రిదా కింద 12 హైరైజ్ (జీ+39 ఫ్లోర్స్) టవర్లలో 3780 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా, ఫేజ్-1లో 6 టవర్లలో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, మంచి స్పందన వస్తోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *