Connect with us

Telangana

వాట్సాప్‌కు వచ్చిన ఫైల్ లింకు పై క్లిక్ చేయగానే రూ.4.70 లక్షలు మాయం

వాట్సాప్‌కు వచ్చిన ఫైల్ లింకు పై క్లిక్ చేయగానే రూ.4.70 లక్షలు మాయం ఇలాంటి తప్పు చేయకండి.

రోజు రోజుకు కొత్త రకాల సైబర్ మోసాలు బయటపడుతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి డబ్బు దోచేస్తున్నారు. తాజాగా, వాట్సాప్‌కు ఏపీకే ఫైల్స్ పంపించి, వాటిని క్లిక్ చేయగానే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ బాధితుడికి ఏపీకే ఫైల్ పంపించిన సైబర్ కేటుగాళ్లు అతడి ఖాతాలోని రూ.4.70 లక్షలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో రకాల సైబర్ మోసాలు బయటపడుతున్నాయి.

ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులు మరియు అత్యాశపరులను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేస్తున్నారు. రోజూ కొత్త రకమైన మోసాలు చేసి సాధారణ ప్రజలను మోసగిస్తున్నారు. నిన్న, మునుపటి వరకు ఖరీదైన బహుమతులు, ఈ కేవైసీ, డ్రగ్స్ పార్శిల్ పేర్లతో మోసాలు చేసిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు వాట్సాప్ నెంబర్లకు లింకులు పంపించి మోసాలు చేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే, బాధితుల ఖాతాల్లోని డబ్బు క్షణాల్లోనే ఖాళీ అవుతుంది.

హైదరాబాద్ నగరంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. వాట్సాప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేసిన బాధితుడు క్షణాల్లోనే రూ.4.70 లక్షలు పోగొట్టుకున్నాడు. అది చూసి బాధితుడు సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాడు. వివరాల్లోకి వెళ్ళితే, హైదరాబాద్ నగరానికి చెందిన 67 ఏళ్ల వ్యక్తికి ఫ్లిప్‌కార్డ్ నుంచి ఇటీవల పార్శిల్ వచ్చింది. డెలివరీ చేసే కొరియర్ బాయ్ రోడ్డుపై నిలబడి బాధితుడి పేరును గట్టిగా పిలిచాడు. వెంటనే బాధితుడు ఇంటి పై అంతస్తు నుంచి కిందకి దిగాడు. ఆ కొరియర్ బాయ్ ప్రవర్తన బారిగా అనిపించడంతో, కొరియర్ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి ఆన్‌లైన్‌లో నంబర్ వెతికాడు. అనంతరం ఆ నంబరు‌కు ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన అవతలి వ్యక్తి, ఫిర్యాదు రుసుము కింద రూ.10 చెల్లించాలని అడిగాడు. కొద్ది సేపటికే మరో నంబర నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది.

ఫిర్యాదు చేయడానికి ఫోన్‌పే ద్వారా రూ.10 చెల్లించాలని కోరారు. బాధితుడు ఆ డబ్బు పంపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, సైబర్ కేటుగాడు వాట్సాప్ నంబర్‌కు కస్టమర్‌కేర్ పేరిట ఒక ఏపీకే ఫైల్ పంపించాడు. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి, క్లిక్ చేయమని అతడు చెప్పాడు. ఫోన్‌లోని అవతలి వ్యక్తి చెప్పినట్లుగా, బాధితుడు ఆ ఫైల్‌పై క్లిక్ చేశాడు. ఆ తర్వాత, అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.4.70 లక్షలు పోయినట్లు  అనట్లు మెసేజ్ వచ్చింది.

ఇదేంటని బాధితుడు అవతలి వ్యక్తిని ఫోన్‌లో అడిగాడు. అతను చెప్పినట్లుగా, పొరపాటు జరిగి ఉంటుందని, డబ్బు మీ అకౌంట్‌లో జమ చేస్తామనుకుని ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసినా, ఎలాంటి ఫలితం రాలేదు. అందులోనే మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వాట్సాప్ నెంబర్లకు వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయకండి అని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైం పోలీసులను సంప్రదించమని వారు అంటున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *