Telangana
హైదరాబాద్‌లో ఒక కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్నాక షాక్ అయ్యాడు!

హైదరాబాద్‌లో ఒక కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్నాక షాక్ అయ్యాడు!
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్న తర్వాత అందులో సగం తాగిన సిగరెట్ పీక కనిపించడంతో షాక్ అయ్యాడు. ఈ ఘటనపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డబ్బుల కోసం కొందరు హోటల్ యజమానులు కస్టమర్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నాసిరకం, పాడైన భోజనం విక్రయిస్తున్నారు. శుభ్రత లేకుండా వంటకాలు చేస్తుండటంతో సాంబార్‌లో బల్లి, పప్పులో బొద్దింక, ఉప్మాలో ఈగ వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తుండినా హోటళ్ల తీరులో మార్పు కనిపించడంలేదు. ఈ సంఘటనల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు పెద్ద షాక్ తగిలింది. బిర్యానీ సగం తిన్న తర్వాత దాంట్లో కనిపించింది చూసి ఖంగుతిన్నాడు. ఈ సంఘటన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లో జరిగింది. కొందరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, వెయిటర్ కొద్ది సమయం తర్వాత బిర్యానీ సర్వ్ చేశాడు.
కొంతమంది స్నేహితులు బాగా ఆకలితో బిర్యానీ తినటం ప్రారంభించారు. కానీ సగం తిన్న తర్వాత, బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సిగరెట్ పీకను చూపించి ప్రశ్నించారు. దీనికి హోటల్ సిబ్బంది శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే కస్టమర్లు ఈ విషయం ఫుడ్ సెఫ్టీ అధికారులతో పాటు మీడియాకు చెబుతామని చెప్పి, ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియోగా రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై తమకు ఫిర్యాదు వచ్చినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల హోటళ్లలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.