Tech

Amazon Great Indian Festival Sale 2024

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దసరా పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ తేదీలను ఇప్పటికే అమెజాన్‌ ప్రకటించింది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచే సేల్‌ అందుబాటులోకి రానుంది. మరో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌’ (Big Billion Days Sale 2024) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో కొనుగోలుదారులకు దసరా (Dussehra 2024) పండగ ముందుగానే మొదలుకానుంది.

అయితే.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌/ క్రెడిట్‌ కార్డ్‌పై డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డు (ఏటీఎం)తో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. మరోవైపు అమెజాన్‌ పే యూపీఐపై కూడా డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. రూ.1000 పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అయితే.. ప్రొడక్ట్‌లపై ఎంత డిస్కౌంట్‌ ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు. ఎప్పటికప్పుడు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version