Andhra Pradesh
కొత్త అల్లుడికి ‘రాయల్’ ట్రీట్: 29 ఏళ్ల వయసు.. 290 రకాల వంటకాలు!

సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ల సందడి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త అల్లుళ్లకు ఇచ్చే మర్యాదలు మామూలుగా ఉండవు. తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఒక అత్తగారి ఇల్లు వార్తల్లో నిలిచింది.
-
సర్ ప్రైజ్ స్వాగతం: నర్సీపట్నం శాంతినగర్‌కు చెందిన నాళం రమేష్ కుమార్-కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్షకు అదిరిపోయే స్వాగతం పలికారు. అల్లుడికి కళ్లకు గంతలు కట్టి భోజనశాల వద్దకు తీసుకెళ్లారు.
-
వయసు @ వంటకాలు: అల్లుడి వయసు 29 ఏళ్లు కావడంతో, దానికి పది రెట్లు అంటే ఏకంగా 290 రకాల వంటకాలతో భారీ విందును సిద్ధం చేశారు.
-
షాక్‌లో అల్లుడు: గంతలు విప్పాక ఎదురుగా ఉన్న వందల రకాల పదార్థాలను చూసి అల్లుడు శ్రీహర్ష ఆశ్చర్యపోయారు. గోదావరి జిల్లాల సంప్రదాయాన్ని తలపించేలా సాగిన ఈ విందు స్థానికంగా చర్చనీయాంశమైంది.
కేవలం నర్సీపట్నమే కాదు, గుంటూరు జిల్లా తెనాలిలో కూడా అల్లుడిపై ప్రేమను వంటకాల రూపంలో కురిపించారు. రాజమండ్రికి చెందిన అల్లుడు శ్రీదత్త కోసం అక్కడి అత్తమామలు 158 రకాల వంటకాలతో పసందైన విందు ఏర్పాటు చేశారు. తాము కూడా ఆతిథ్యంలో ‘గోదారోళ్ల’కు తక్కువ కాదని నిరూపించారు.
మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతి అల్లుళ్లకు కడుపు నిండా విందును, మనసు నిండా తీపి జ్ఞాపకాలను అందించింది.
#Sankranthi2026 #NewSonInLaw #RoyalFeast #AndhraVindu #Narsipatnam #Tenali #TeluguTradition #FoodLover #SankranthiCelebrations #SpecialTreat #290ItemsFeast