Entertainment

SSMB29 బడ్జెట్‌ 1000 కోట్లు.. బిజినెస్ ఏమో 2000 కోట్లు అంట!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న తర్వాతి సినిమా కోసం గ్లోబల్ రేంజ్ లో ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి, RRR లతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ వైపు దృష్టి పెట్టాడు. మహేష్ బాబుతో చేస్తున్న ప్రాజెక్టులో హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఉండబోతోన్నారని సమాచారం. ఇక ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని ఇది వరకే విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆఫ్రికాలో జక్కన్న, కార్తికేయ రెక్కీ చేసి అక్కడ లొకేషన్లు ఫిక్స్ చేశారు.

రాజమౌళి ఈ మూవీని తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా లోనే కాకుండా హాలీవుడ్ లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ ఫిల్మ్‌ మేకర్‌ తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది, బిజినెస్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి అనే విషయమై తన విశ్లేషణ అందించారు.

ఆయనకు తెలిసిన సమాచారం ప్రకారం రాజమౌళి ఈసారి రూ.1000 కోట్లబడ్జెట్‌తో సినిమాను రూపొందించబోతున్నారు. ఇక సినిమాకు రూ.2000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సినిమా వసూళ్లు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో ఎంత నిజం ఉందన్న భవిష్యత్తు చెబుతుంది. కానీ రాజమౌళి మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.

వీలైనంత టైం తీసుకుని మెళ్లిగా సినిమాను చెక్కుతాడని తెలిసిందే. అసలు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది అన్నది ఎవ్వరికీ తెలియడం లేదు. మహేష్ బాబు మాత్రం జుట్టు, గడ్డం పెంచుకుని రెడీగా ఉన్నాడు. తమ్మారెడ్డి చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ వ్యాల్యూ మాత్రం చాలా గట్టిగానే ఉండబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version