Connect with us

Entertainment

రజనీకాంత్ ‘వేట్టయన్ ది హంటర్’ మూవీ రివ్యూ..

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమా ‘వేట్టయన్’ థియేటర్లలో సందడి చేస్తోంది. ‘మనసిలాయో’ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు, అలాగే ఓవర్సీస్‌లో ప్రదర్శనలు మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విటర్‌లో, నెటిజన్లు తమ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు.

జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం ‘వేట్టయన్’. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో భాగమయ్యారు. టీజర్‌, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ‘మనసిలాయో’ పాట, అందులో మంజూ వారియర్, రజనీల స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. ఇలా అభిమానుల భారీ అంచనాల

మధ్య గురువారం (అక్టోబర్ 10) వెట్టయన్ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజయ్యింది. ఇప్పటికే చాలాచోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు, ఓవర్సీస్ షోలు పడ్డాయి. దీంతో రజనీ సినిమాను చూసిన పలువురు తమ అభిప్రాయలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. వేట్టయన్ సినిమాలో రజనీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయిందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే అమితాబ్, రానా, ఫాహద్ ఫాజిల్ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయంటున్నారు. ఇక మంజూ వారియర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని పొగుడుతున్నారు.

“వెట్టయన్”లో రజనీకాంత్ పోలీసు ఎన్‌కౌంటర్ ఆఫీసర్‌గా నటించారు మరియు ట్రైలర్ మనకు చెడ్డ పోలీసుగా మరియు అమితాబ్ బచ్చన్ మంచి పోలీసుగా మధ్య జరిగే పోటీని మనకు తెలియజేస్తుంది. ఈ చిత్రం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ మరియు ఆకర్షణీయమైన కథాంశం. చిత్రం. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేయగా, లాంగ్ వీకెండ్ మరియు దసరా సెలవులు కావడంతో మొదటి వారాంతంలో ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంటున్నారు.

Loading