Sports

VVS Laxman About Team india మూడు ఫార్మాట్లలో టీమ్​ఇండియా సక్సెస్​ సీక్రెట్ ఇదే

మూడు ఫార్మాట్లలో టీమ్​ఇండియా సక్సెస్​ సీక్రెట్ ఇదే – మరో 10 ఏళ్లు ఢోకా లేదు’ – VVS Laxman About Teamindia

VVS Laxman About Teamindia : అంతర్జాతీయ క్రికెట్లో మరో పదేళ్ల పాటు టీమ్ ఇండియా ఆధిపత్యం చెలాయిస్తుందని అన్నాడు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (బీసీఈ) చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌. టీమ్​ ఇండియా అన్ని ఫార్మట్లలో ఆధిపత్యం చెలాయించడానికి గల కారణాన్ని తెలిపాడు. కావాల్సినంత మంది ప్లేయర్స్​ దేశంలో ఉన్నారని చెప్పాడు.

నేను డిసెంబర్ 2021లో ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు, నేను చాలా అయిష్టంగా ఉన్నాను. కానీ నేను ఈ బాధ్యతను స్వీకరించిన తర్వాత సంతృప్తికరమైన అనుభవం దక్కింది. ఎందుకంటే అంతర్జాతీయ స్టార్‌లతో మాత్రమే కాకుండా, బెంచ్​లోనూ బలాన్ని సృష్టిస్తున్నాము. అందుకే టీమ్ ఇండియా బలంగా ఉంటూ ఆటలో రాణిస్తోంది. ప్రతిభ, మంచి సామర్థ్యం ఉన్న ఆటగాళ్లను చూడటం చాలా సంతృప్తికరంగా ఉంది. రాబోయే పదేళ్లు దేశం గర్వించేలా చేసే చాలా మంది ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారని ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. పురుషుల్లోనే కాదు మహిళల క్రికెట్లో కూడా. అంతటి ప్రతిభ కలిగి ఉండటం మన అదృష్టం. ప్రతి ఏడాది కనీసం రెండు ఎ- జట్టు పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నాం. ప్రపంచంలోని అన్ని పరిస్థితులపై అవగాహన, అనుభవం సంపాదించేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడతాయి.” అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

VVS Laxman About Women T20 WorldCup : మహిళల టీ20 ప్రపంచ కప్​ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 3న గ్రాండ్​గా మొదలు కానుంది. యూఈఏ వేదికగా గురువారం నుంచి నిర్వహించనున్నారు. దీనిపై కూడా లక్ష్మణ్ మాట్లాడాడు. మహిళల టీ20 వరల్డ్​ కప్‌ కోసం శిక్షణ శిబిరంలో భారత జట్టు ఎంతగానో శ్రమించింది. అమ్మాయిల సాధన, నిబద్ధత, పట్టుదలకు సాటిలేదు. వాళ్లు సన్నద్ధమైన విధానం నాకు ఎంతో గర్వంగా అనిపించింది” అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, ఇప్పటి వరకు 8 సార్లు మహిళల టీ20 ప్రపంచ కప్​ జరగగా, ఆస్ట్రేలియా ఆరుసార్లు 2010, 2012, 2014, 2018, 2020, 2023 విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌ 2009లో, వెస్టిండీస్‌ 2016లో ఒక్కో టైటిల్​ను అందుకున్నాయి. ఈ సారి టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. ఐదేసి జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి, మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్​లో తలపడతాయి. లీగ్‌ దశలో రెండు గ్రూప్‌ల నుంచి టాప్‌ రెండు జట్లు సెమీస్‌కు వెళ్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version