Latest Updates

బాలీవుడ్ షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్.. కేసు నమోదు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని.. డబ్బులు ఇవ్వాలని రకరకాల బెదిరింపు కాల్స్ చేసిన విషయం మనకి తెలిసిందే. ఇక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్‌కు సన్నిహితంగా ఉన్న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన ఘటన దేశం మొత్తం సంచలనంగా రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి ఆ బెదిరింపు కాల్ గురించి ఆరా తీశారు. ఆ ఫోన్ కాల్ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని భావించిన ముంబై బాంద్రా పోలీసులు.. దీనిపై మరింత లోతైన విచారణ జరిపి.. నిందితుడిని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్‌ అని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు కాల్ ఫోన్ నంబర్ ఆధారంగా ఫైజాన్ జాడను కనిపెట్టారు. ఈ నేపథ్యంలోనే బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక గతేడాది కూడా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పఠాన్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షారుఖ్ ఖాన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర సర్కార్.. షారుఖ్ ఖాన్‌కు భద్రతను పెంచారు. ఆయనకు వై+ సెక్యూరిటీని మహారాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version