Connect with us

Latest Updates

#SavePunarvika: రూ. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం పోరాటం.. కదిలివచ్చిన తెలుగు లోకం!

#SavePunarvika #పునర్విక #కర్నూలుచిన్నారి #సాయంచేయండి #తెలుగురాష్ట్రాలు #మానవత్వం #విరాళాలు #సోషల్మీడియాపవర్ #తెలంగాణఆంధ్రప్రదేశ్ #మెడికల్హెల్ప్ #పసిపాపప్రాణాలు

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నిరూపిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పునర్విక కోసం ఊరూవాడ ఏకమైంది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల గారాల పట్టి పునర్వికశ్రీని కాపాడుకునేందుకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే నినాదం వినిపిస్తోంది.. అదే #SavePunarvika

చిన్నారి పునర్విక ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ (SMA Type-1) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి వల్ల పాప కండరాలు క్షీణించి, శరీరాన్ని కదిలించలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ప్రాణాంతక వ్యాధికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్‌జెన్‌స్మా’ (Zolgensma) అనే ఇంజెక్షన్ ఒక్కటే పరిష్కారం. దీని ధర అక్షరాలా రూ. 16 కోట్లు.

సామాన్య క్షవర వృత్తి చేసుకునే సురేష్ కుటుంబానికి అంత భారీ సొమ్ము సమకూర్చడం అసాధ్యం. ఈ విషయం తెలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాల్లో యువత సైకిల్ ర్యాలీలు చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారు,పాఠశాల విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని పునర్విక చికిత్స కోసం అందిస్తూ అందరినీ కదిలిస్తున్నారు,మంత్రి టీజీ భరత్ ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయగా, దాతలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

మీరు సాయం చేయాలనుకుంటున్నారా?

పసిపాప ప్రాణాలు నిలబడాలంటే ఇంకా చాలా నిధులు అవసరం. సాయం చేయాలనుకునే దాతలు పాప తండ్రి సురేష్ (7799279441) ను సంప్రదించవచ్చు. మనమందరం చేయి చేయి కలిపితే ఆ పసిపాప నవ్వులను మళ్ళీ చూడవచ్చు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *