Latest Updates
సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు.. ఈ సారి ఎంత డబ్బు కోరారంటే..!

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరో సందేశం వచ్చింది. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే.. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించారు. వర్లీ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.. ఈ బెదిరింపులకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో చనిపోయిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీని చంపుతామని బెదిరించిన కేసులో, 20 సంవత్సరాల గుఫ్రన్‌ను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది.
మంగళవారం ముంబై పోలీసుల కలిసి చేసిన ఆపరేషన్‌లో సల్మాన్ ఖాన్‌ను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడ్ని అని చెప్పుకున్నాడు. ఇటీవల ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులను అలాగా తీసుకోవద్దని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలని, దీనికి ఆయన రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ డబ్బులు కనుక ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. ఆ తర్వాత అతడే మరో మెసేజ్ కూడా పంపాడు. తాను తలుచుకోకుండా అలా జరిగిపోయిందని, ఉద్దేశపూర్వకంగా బెదిరించలేదని చెప్పి, తనను క్షమించమని కోరాడు. ఈ సందేశం ఆధారంగా దర్యాప్తు చేయగా, జార్ఖండ్ పోలీసుల సహాయంతో జంషెడ్‌పూర్‌లోని ఒక కూరగాయల వ్యాపారి చేశారని తెలుసుకుని అరెస్ట్ చేశారు.
కృష్ణజింకలను వేటాడినందుకు సల్మాన్‌ఖాన్‌ను చంపుతామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అంటోంది. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామంది.. ఇప్పటికే పలుసార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ఖాన్‌ను బెదరించాయి. అయితే ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ఇటీవల దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధిఖీ హత్యకు ఈ గ్యాంగ్ బాధ్యత తీసుకుంది.