Connect with us

Entertainment

పీఆర్ దేనికి..? ప్రతీ రోజూ అంటే బోర్ కొట్టదా.. అంటున్న సాయి పల్లవి

సాయి పల్లవి ప్రస్తుతం ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. నిదానమే ప్రధానం అన్న చందాన సాగుతోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో సినిమాను చేస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి అమరన్, తెలుగులో నాగ చైతన్యతో తండేల్, హిందలో రణ్‌బీర్ కపూర్‌తో రామాయణ్ మూవీని చేస్తోంది. ఇందులో అమరాన్ మూవీ ఈ దీపావళికి రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా పెంచేసింది చిత్రయూనిట్. ఆర్మీ బేస్డ్ మూవీ అయిన ఈ చిత్రం సాయి పల్లవి మేజర్ భార్యగా నటించింది.

విరాట పర్వం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి మాట్లాడిన మాటలు ఎంత కాంట్రవర్సీగా మారాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దేశ భక్తిని చాటే చెప్పే చిత్రంలో సాయి పల్లవి నటిస్తోందని, ఆమెకు ఆ అర్హత లేదంటూ పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఆమె అప్పుడు అలా మాట్లాడిందంటూ గుర్తు చేస్తున్నారు. ఇక సాయి పల్లవి అప్పుడు ఆ మాటలపై క్లారిటీ ఇచ్చినా కూడా ప్రజల ఆగ్రహం చల్లారలేదు.

తాజాగా అమరన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి తమిళ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్‌లోని ఓ పీఆర్ ఏజెన్సీ గురించి మాట్లాడింది. ఇలా హీరోయిన్‌లు మాట్లాడుతూ కొన్ని విషయాలను బయటపెట్టేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో, జిమ్ ఏరియాలో ఫోటోలు తీసేందుకు ఫోటో గ్రాఫర్లను ప్రత్యేకంగా పిలిపించుకుని, డబ్బులు ఇప్పించి మరీ ఫోటోలు తీయించుకుంటారట. ఆ మధ్య కాలంలో ఓ స్టార్ హీరోయిన్ మీడియా తోనే వీటికంటూ సపరేట్ గా పీఆర్ ఏజెన్సీలు ఉన్నాయంటూ ఆమె చెప్పింది.

కానీ పెద్ద పెద్ద హీరోలంతా కూడా ఇప్పుడు పీఆర్‌ను మెయింటైన్ చేస్తున్నారు. హీరోలందరిలోకెల్లా అల్లు అర్జున్ పీఆర్ టీం చాలా స్ట్రాంగ్ అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. బన్నీలా పీఆర్ మెయింటైన్ చేయాలి.. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావ్ అంటూ సాయి పల్లవికి సోషల్ మీడియాలో నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

ఇక ఇప్పుడు సాయి పల్లవి కూడా ఇలాంటి ఓ పీఆర్ గురించి మాట్లాడింది. బాలీవుడ్‌లో ఓ పీఆర్ ఏజెన్సీ, యంగ్ బాయ్ ఆమెను కలిశాడట. పీఆర్ చేయమంటారా? మీ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం ట్రెండ్ చేస్తామని, జనాలు మాట్లాడుకునేలా చేస్తామని ఇలా ఏదో అన్నారట. పీఆర్ ఎందుకు? నాకు వద్దు.. అయినా ఎప్పుడూ జనాలు నా గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్లకి బోర్ కొడుతుంది.. నాకు ఎలాంటి పీఆర్ మేనేజింగ్ వద్దు అని సాయి పల్లవి తిరస్కరించిందట.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *